AALU MOGALU SONG LYRICS: The song is sung by Srinidhi and Suman and released by Gaddam Raj Telugu vlogs label. AALU MOGALU is a Folk Telugu song, composed by Madeen SK, with lyrics written by Bullet Bandi Laxman. The music video of this track is picturised on Lucky Charan and Sunitha Marasiar.
ఆలు మొగలు Aalu Mogalu Lyrics in Telugu
చీకట్ల సిదుల్లా బతుకుతున్నాం
ఈ సిన్న గుడిసెలలో
కంటోలు బియ్యమే తింటువున్నాం
మన ఎల్లా లేదురయ్యె
కష్టాల్లో తోడున్న అందరికి
నా ఓళ్ళు నా ఓళ్లోని
కనిపిస్తలేనమ్మ కొందరికి
కష్టాల్లో నేనున్నని
నా ఓళ్ళు నీ ఓళ్ళు ఏమున్నది
అన్ని కాగితాల బంధాలు అవి
కాగితాలే జీవితాలనుకొని
అయినోళ్ళనే వదులుకుంటారయ్యా
బాగుంటే పది మంది వస్తరయ్యో
సుట్టాలై మన ఇంటికి
లేకుంటే వదిలేసి పోతారయ్యో
అయినోళ్లే ముమ్మాటికీ
చూస్తున్న చుట్టంతా కళ్ళతోని
జరిగేది నాటకమే
నా ఒళ్ళు మీ ఒళ్ళు అనిపించేది
చేత చెల్లేటి కాగితమే
పెద్ద మేడల్లా పెరిగినవే
పూరి గుడిసెల కచ్చినవే
మంచి కారుల్లో తిరిగినవే
కాలి నడకన పోతున్నవే
నాకు నీ మనసు మేడ కన్నా
పెద్ద మేడలు ఏమున్నాయే
నాకు నీతోటి తిరేగే కన్నా
మంచి కారులు ఏమున్నాయే
bharatlyrics.com
ఏ మొగనికి దొరకని అదృష్టమే
నాకు దొరికిందిరమ్మో
ఏ కష్టాలకైనా ఎదురుపోయి
నిన్ను రానోలె చూస్తానమ్మో
ఆ తలనొప్పులు ఎందుకయ్యో
ఉన్నంతలో బ్రతుకుదాం
కలిగింది కలగంజో తినుకుంటా
ఎవరికి తలవంచకుండా ఉందాం
నే గడపదాటంగా నువ్వు ఎదురుగొస్తే
ఏ కష్టం వస్తదమ్మో
నీ నవ్వు కోసమై నే కష్టపడితే
అలుపెందుకు వస్తదమ్మో
నీకు సొమ్ములు లేవు అని
సిన్న సూపులు చూస్తున్నారే
మనకు మేడలు లేవు అని
చానా దూరంగా పెడుతున్నారే
ఎప్పుడొక్కలెక్కనే ఉంటామా
ముందు కాలన మారబోమా
నువ్వు బాదేందుకడతావయ్యో
ఆ భగవంతుండుండురయ్యో
నీ పాదాలకే దండమెడత పిల్ల
నువ్వు చిన్నదానివైనా
నా ఏడు జన్మలకే కోరుకుంటా మల్లా
నా తోడు నీడలాగా
ఓ బావ అంత పెద్ద మాటలెందుకు
నిదాన్ని నేనురయ్య
నీ కడుపు నింపేటి ఆలినే కాదు
నీ కష్టానా అమ్మనయ్యా
ఏ పుణ్యమో నేను చేసుకున్నానో
నువ్వు దొరికినవే మరి
కన్నీళ్లు కళ్ళలో రాకముందే
గుండెకైతావు నువ్వు ఊపిరి.
