ANDHRA TO TELANGANA SONG LYRICS: The song is sung by Dhanunjay and Sameera Bharadwaj from the Telugu film Anaganaga Oka Raju, directed by Maari. The film stars Naveen Polishetty and Meenakshi Chaudhary in the lead role. The music of "Andhra to Telangana" song is composed by Mickey J Meyer, while the lyrics are penned by Chandrabose.
ఆంధ్ర టు తెలంగాణ Andhra to Telangana Lyrics in Telugu
నాలోను సోకులున్నాయ్ సొంపులున్నాయ్ శానా
నీతాన సొమ్ములున్నాయ్ యెల్దామ్ ఎక్కడికైనా
ఆంధ్ర టు తెలంగాణ
నువ్వు రమ్మంటే నే రానా
నావంటి వన్నెలాడి లేదోయ్ జిల్లాలోన
నేనంటే కిందా మీదా పడతాడే ఎవరైనా
ఆంధ్ర టు తెలంగాణ
నువ్వు రమ్మంటే నే రానా
హే నాటు కోడి లాంటి ఘాటు ఘాటు ముచ్చట పెడదామా
తాటి కల్లు తాగి ఒళ్లు మరిచి అల్లరి చేద్దామా
చిత్రంగా చిందులే వెయ్యాలమ్మా
మొత్తంగా మోతక్కి పోవాలమ్మా
ఆంధ్ర టు తెలంగాణ
నువ్వు రమ్మంటే నే రానా
ఆంధ్ర టు తెలంగాణ
నువ్వు రమ్మంటే నే రానా ఏమంటావ్…
నీ కోసం ఊపు తెచ్చానే బంగరు షాపు తెచ్చానే
డబ్బుల మోపు తెచ్చానే జానే జానా
నేనొస్తే చిల్ మంటాదే హౌసు ఫ్లులుగుంటాదే
దద్దరిల్లిపోతాదే అన్నీ ఊర్లలోనా
ఉలికిలికి పడ్డానయ్యా ఉరికిరికి వచ్చానయ్యా
నీ చురుకే నచ్చిందయ్యా నువ్వు నాకే రాజావయ్యా
మహరాజుల తీరే మాది మర్యాదల జోరే వేరే
మా సరదా సందడి చూసి మళ్లీ మళ్లీ వచ్చేద్దారే
హే అత్తారింటికొచ్చే అల్లుడల్లే అల్లాడిస్తావా
ఐతే అంతులేని సంబరాలే పిల్లా చూస్తావా
భారత్ల్య్రిక్స్.కోమ్
పండక్కి దూకామా పందిల్లోన
రంగుల్తో దిగినామా రంగంలోన
ఆంధ్ర టు తెలంగాణ… పడి చస్తారే మనపైనా…
ఆంధ్ర టు తెలంగాణ… పడి చస్తారే మనపైనా…
ఆంధ్ర టు తెలంగాణ… పడి చస్తారే మనపైనా…
మై విలేజ్ స్టెప్పును వైరల్ చేసిన
రాజుగారికి ఒక ఓయ్ యేసుకోండో.
