Manasuna Unnadi Cheppalani Unnadi lyrics, మనసు ఉన్నాది చెప్పాలని ఉంది the song is sung by K.S. Chitra from Priyamaina Neeku. Manasuna Unnadi Cheppalani Unnadi Love soundtrack was composed by S. A. Rajkumar with lyrics written by Sirivennela Seetharama Sastry.
Manasuna Unnadi Cheppalani Unnadi Lyrics
Manasuna unnadi cheppaalanunnandi
Maatalu raave elaa…?
Maatuna unnadi oo manchi sangathi
Bayatiki raadhe elaa…?
Athadini choosthe reppalu vaalipoye
Idiyam aapedhela…?
Edhuruga vasthe cheppaka aagipoye
Thalapulu choopedhela…?
Okasaari dharicheri yedha godavemito
Thelapakapothe elaa..!
Manasuna unnadi cheppaalanunnandi
Maatalu raave elaa…?
Chintha nippaina challaga undhani
Entha noppaina theliyaledhani
Thanane thalachukune vedilo
Prema antene theeyani badhani
Letha gundello kondantha baruvani
Kotthagaa telusukune velalo
Kanabaduthondaa naa priyamaina neeku
Naa yedha kotha ani adagaalani
Anukuntoo thana chuttoo madhi thirigindhani
Thelapakapothe elaa…?
Manasuna unnadi cheppaalanunnandi
Maatalu raave elaa…?
Neeli kannullo athani bommani
Choosi naakinkaa chotekkadundhani
Nidhare kasurukune reyilo
Melukunnaayi em vintha kaipani
Vela oohallo ooregu choopuni
Kalale musurukune haayilo
Vinabaduthondhaa naa priyamaina neeku
Aashala raagam ani adagaalani
Pagaledho reyedho gurutheledhani
Thelapakapothe elaa…?
Manasuna unnadi cheppaalanunnandi
Maatalu raave elaa…?
Maatuna unnadi oo manchi sangathi
Bayatiki raadhe elaa…?
Athadini choosthe reppalu vaalipoye
Bidiyam aapedhela…?
Edhuruga vasthe cheppaka aagipoye
Thalapulu choopedhela…?
Okasaari dharicheri yedha godavemito
Thelapakapothe elaa.
మనసు ఉన్నాది చెప్పాలని ఉంది Lyrics in Telugu
మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా…?
మాటున ఉన్నది ఓ మంచి సంగతి
బయటికి రాదే ఎలా…?
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే
బిడియం ఆపేదెలా…?
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే
తలపులు చూపేదెలా…?
ఒకసారి దరిచేరి యద గొడవేమిటో
తెలపకపోతే ఎలా…?
మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా…?
చింత నిప్పైన చల్లగ ఉందని
ఎంత నొప్పైన తెలియలేదని
తననే తలచుకునే వేడిలో
bharatlyrics.com
ప్రేమ అంటేనే తీయని బాధని
లేత గుండెల్లో కొండంత బరువని
కొత్తగా తెలుసుకునే వేళలొ
కనబడుతోందా నా ప్రియమైన నీకు
నా యద కోత అని అడగాలనీ
అనుకుంటూ తన చుట్టూమది తిరిగిందనీ
తెలపకపోతే ఎలా…?
మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా…?
నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి
నాకింకా చోటెక్కడుందని
నిదరే కసురుకునే రేయిలో
మేలుకున్నాయి ఏం వింత కైపని
వేల ఊహల్లో ఊరేగు చూపుని
కలలే ముసురుకునే హాయిలో
వినబడుతోందా నా ప్రియమైన నీకు
ఆశల రాగం అని అడగాలని
పగలేదో రేయేదో గురుతేలేదని
తెలపకపోతే ఎలా…?
మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా…?
మాటున ఉన్నది ఓ మంచి సంగతి
బయటికి రాదే ఎలా…?
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే
బిడియం ఆపేదెలా…?
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే
తలపులు చూపేదెలా…?
ఒకసారి దరిచేరి యద గొడవేమిటో
తెలపక పోతే ఎలా.