O Priya Priya lyrics, ఓ ప్రియా ప్రియా the song is sung by S. P. Balasubrahmanyam, K.S. Chitra from Geethanjali. O Priya Priya Sad soundtrack was composed by Ilaiyaraaja with lyrics written by Veturi.
O Priya Priya Lyrics
O priya priya… Naa priyaa priyaa
Ela gaali medalu… Raalu poola dhandalu
Needho lokam naadho lokam
Ningi nela thaakedhelaaga
O priya priya… Naa priyaa priyaa
O priya priya… Naa priyaa priyaa
Ela jaali maatalu… Maasipovu aashalu
Ninginela thaakevela
Neeve nenai poye velaaye
Nedu kaadhule… Repu kaadhule
Veedukoledhe… Veedukolidhe
Nippulona kaaladhu… Neetilona naanadhu
Gaalilaaga maaradhu… Prema sathyamu
Raachaveeti kannedhee rangu rangu swapnamu
Pedhavaadi kantilo prema rakthamu
Gaganaalu bhuvanaalu veligedhi prematho
Jananaalu maranaalu pilichedhi prematho
Enni baadhalochhinaa edhuruledhu premaku
Raajashasanaalaki longipovu premalu
Savaalugaa theesuko o… Nee prema
O priya priya… Naa priyaa priyaa
O priya priya… Naa priyaa priyaa
Kalidasu geethiki… Krishna raasaleelaki
Pranayamoorthi radhaki… Prema pallavi
Aa anaaru aashaki… Tajmahalu shobhaki
Pedhavaadi premaki… Chaavu pallaki
Nidhikannaa edhaminna… Gelipinchi premale
Kathakaadhu brathukante… Balikaani premani
Vellipoku nesthamaa… Praanamaina bandhamaa
Penchukunna paashame… Thenchi vellipokumaa
Jayinchedhi okkate o… Nee prema
O priya priya… Naa priyaa priyaa
O priya priya… Naa priyaa priyaa
Kaalamanna preyasi theerchamandhile kasi
Ningee nela thaakevela
Neeve nenai poye kshanaana
Ledhu shasanam… Ledhu bandhanam
Premaku jayam… Premadhe jayam.
ఓ ప్రియా ప్రియా Lyrics in Telugu
ఓ ప్రియా ప్రియా… నా ప్రియా ప్రియా
ఏల గాలి మేడలు… రాలు పూల దండలు
నీదో లోకం నాదో లోకం
నింగి నేల తాకేదెలాగ
ఓ ప్రియా ప్రియా… నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా… నా ప్రియా ప్రియా
ఏల జాలి మాటలు… మాసిపోవు ఆశలు
నింగీనేల తాకేవేళ
నీవే నేనై పోయే వేళాయె
నేడు కాదులే… రేపు లేదులే
వీడుకోలిదే… వీడుకోలిదే
నిప్పులోన కాలదు… నీటిలోన నానదు
గాలిలాగ మారదు… ప్రేమ సత్యము
రాచవీటి కన్నెదీ రంగు రంగు స్వప్నము
పేదవాడి కంటిలో ప్రేమ రక్తము
గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
ఎన్ని బాదలొచ్చినా ఎదురులేదు ప్రేమకు
రాజశాసనాలకి… లొంగిపోవు ప్రేమలు
సవాలుగా తీసుకో ఓ… నీ ప్రేమ
ఓ ప్రియా ప్రియా… నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా… నా ప్రియా ప్రియా
కాళిదాసు గీతికి… కృష్ణ రాసలీలకి
ప్రణయమూర్తి రాధకీ… ప్రేమ పల్లవి
ఆ అణారు ఆశకి… తాజ్మహలు శోభకి
పేదవాడి ప్రేమకి… చావు పల్లకి
నిధికన్నా ఎదమిన్న… గెలిపించు ప్రేమలే
కథకాదు బ్రతుకంటే… బలికాని ప్రేమని
వెళ్ళిపోకు నేస్తమా… ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమే… తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటే ఓ…నీ ప్రేమ
bharatlyrics.com
ఓ ప్రియా ప్రియా… నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా… నా ప్రియా ప్రియా
కాలమన్న ప్రేయసి తీర్చమందిలేకసి
నింగీ నేల తాకేవేళ
నీవే నేనై పోయే క్షణాన
లేదు శాసనం… లేదు బందనం
ప్రేమకే జయం… ప్రేమదే జయం.