LYRICS OF PADHE PADHE: The song is recorded by Sindhuja Srinivasan from a Telugu-language film Raakaasa, directed by Manasa Sharma. The film stars Ashish Vidyarthi, Vennela Kishore and Nayan Sarika in the lead role. "Padhe Padhe" is a Love song, composed by Anudeep Dev, with lyrics written by Kittu Vissapragada.
పదే పదే Padhe Padhe Lyrics in Telugu
పదే పదే ప్రాణం నిన్నే కోరగా
కలే నిజం కాదా నిన్నే చేరగా
ఒకే ఒక ఆశ నువ్వే చాలు గా
ప్రపంచమే లేదే
ప్రతీ క్షణం నువ్వే నా కథ
అలా అలా దారి నీ వైపుగా మారి
సరాసరి నిన్నే చేరనా?
మరీ మరీ నీతో ఉండాలని కోరి
మనస్సునే రాసి ఇవ్వనా
కళ్ళు మూస్తూ ఉన్నా నిన్నే చూస్తున్నా
నీ కన్నుల్లో నన్నే వెతకనా?
దాచుకోలేనంత ప్రేమ నా పైన
నువ్వే కురిపించాలని కోరనా?
భారత్ల్య్రిక్స్.కోమ్
చేతిలోన గీత లాగ నిన్ను
నేనేమార్చుకున్నా
గాలి కూడా తాకకుండా
నిన్ను నాలో దాచనా
చిరు చిరు చిరు నవ్వులు కురిసే
పెదవులు నీ పేరే పలికే
ప్రతి అడుగిక నీ వెనకాలే
చిట్టి గుండె ఊరుకోదే
చిరు చిరు చిరు నవ్వులు కురిసే
పెదవులు నీ పేరే పలికే
ప్రతి అడుగిక నీ వెనకాలే
కాదు అంటే ఊరుకోనే
మాటల్లో తెలిపేటి వీలుందా
మౌనంలో మాటే వినిపిస్తోందా
ఆనాటి స్నేహంలో తీపంతా
ఈనాటి ప్రేమల్లే మారిందా
పదే పదే ప్రాణం నిన్నే కోరగా
కలే నిజం కాదా నిన్నే చేరగా
ఒకే ఒక ఆశ నువ్వే చాలు గా
ప్రపంచమే లేదే
ప్రతీ క్షణం నువ్వే నా కథ
చిరు చిరు చిరు నవ్వులు కురిసే
పెదవులు నీ పేరే పలికే
ప్రతి అడుగిక నీ వెనకాలే
చిట్టి గుండె ఊరుకోదే
చిరు చిరు చిరు నవ్వులు కురిసే
పెదవులు నీ పేరే పలికే
ప్రతి అడుగిక నీ వెనకాలే
కాదు అంటే ఊరుకోనే.
