రావమ్మ సీతమ్మ Ravamma Sithamma Lyrics in Telugu
నా గుండెలో ఉన్న బాధ
నీకెట్టా చెప్పాలని
నా కలల రాణి నువ్వని నీకు
నేనెట్టా తెలుపాలని
నీ రూపమే నా కళ్ళలో
పదిలంగా దాగున్నదే
నీ వేలునే పట్టాలని
నా మనసు కోరుతుందే
మన జోడి బాగున్నదే
అందరు అంటున్నారే
ఆ రామయ్య సీతలాగే
పిలిచారు మన జంటనే
భారత్ల్య్రిక్స్.కోమ్
నువ్ రావమ్మ సీతమ్మ నేను
నీ మేడలో పుస్తే గడతా
రావమ్మ సీతమ్మ నేను
నీ కాలికి మెట్టెనౌతా
చిన్ననాటి మన జ్ఞాపకాలన్నీ
గుర్తుకొస్తున్నాయే జాబిలమ్మా
నా తోడు నువ్వంటూ నీ తోడు నేనంటూ
ఊహల మేడలు కట్టానమ్మా
నీ కొంటె చూపులు నీ చిలిపి అల్లరి
నీలోనే దాగుంది నేనేనమ్మా
నా చిన్ని గుండె నీ మీద బెంగతో
తల్లడిల్లినాదే బంగారమా
నీ మనసులో నేనున్నానే
నీ మౌనాన్ని వీడరాదే
నీ మనసులో చోటిస్తేనే
నీ మహారాజు నేనే కదే
నువ్ రావమ్మ సీతమ్మ నేను
నీ మేడలో పుస్తే గడతా
రావమ్మ సీతమ్మ నేను
నీ కాలికి మెట్టెనౌతా
కనుమూసినా నువ్వే కనుతెరిచినా నువ్వే
కలవరింతలోనే నువ్వేనమ్మా
ప్రాణంగా ప్రేమించి మనసిప్పి చెప్పని
ఈ పిచ్చి ప్రేమంటే నాదేనమ్మా
పచ్చాని పందిల్లొ నీ వేలునే పట్టి
ఏడడుగులేస్తానే ఎన్నెలమ్మా
ముక్కొటి దేవుళ్ళు మన జంటనే చూసి
నూరేళ్ళు దీవెనలు ఇచ్చేరమ్మా
ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా
కలిసి ఉందామే కలకాలము
నువ్వు తోడుంటే ఈ జన్మకే
ముల్లదారైనా పూలదారే
నువ్ రావమ్మ సీతమ్మ నేను
నీ మేడలో పుస్తే గడతా
రావమ్మ సీతమ్మ నేను
నీ కాలికి మెట్టెనౌతా.