THIRIGI CHUDU SONG LYRICS: Thirigi Chudu is a Telugu song from the film India Files starring Addanki Dayakar, Indraja, Sitara, directed by Bommaku Murali."THIRIGI CHUDU" song was composed by M.M. Keeravaani and sung by M.M. Keeravaani, with lyrics written by Mounasri Mallik.
తిరిగి చూడు Thirigi Chudu Lyrics in Telugu
తిరిగి చూడు తిరిగి చూడు
తిరుగుతున్న భూమినీ
కలిసి చూడు కలిసి చూడు
మనిషిలోని మనిషినీ
నడచి వచ్చిన పాదముద్రలు
చెరిపివేసిన శక్తులేవో
వెలుగునిచ్చిన జ్ఞానజ్యోతులనార్పిన
కుయుక్తులేవో
అనచివేతకు ఆజ్యమైన
కారణాలను తెలుసుకో
తిరిగి చూడు తిరిగి చూడు
తిరుగుతున్న భూమినీ
కలిసి చూడు కలిసి చూడు
మనిషిలోని మనిషినీ
మహిళలంటూ పురుషులంటూ
మనవాళిని వేరుచేసి
అబలవంటూ అద్దమిచ్చి
అందమైన భ్రమల తోసి
సంప్రదాయపు ముసుగు వేసిన
వారు ఎవరో తెలుసుకో
ఇంద్రచాపం రంగు మాపిన
వారు ఎవరో కలుసుకో
తరచి చూడు తరచి చూడు
వాడిపోయిన మగువను
తగిలి చూడు తగిలి చూడు
బూడిదైన తెగువను
అగ్ర వర్ణము నిన్న వర్ణము
అంటు మనలను వేరుచేసి
స్వార్ధ బీజములేవో నాటి
విశ్వభావన కాలరాసీ
కోట్లదేవుల పేరు చెప్పి
కొరివి పెట్టినదెవ్వరో
భక్తి పేరున జనము నడిచే
రచన చేసినదెవ్వరో
తరలి చూడు తరలి చూడు
శిలల మొక్కే ప్రజలను
మరలి చూడు మరలి చూడు
గూడు కట్టిన దిగులును
వేట కొడవలి చేతపట్టి
రక్తపాతపు దాడులెన్నో
బాల భవితను చిదిమి వేసే
దాస్టికాల చర్యలెన్నో
జన్యువులలో విషము నింపిన
కపటి ఎవరో తెలుసుకో
మాన్యులంటూ మనలనేలే
కుట్రదారుల కలుసుకో
పొగిలి చూడు పొగిలి చూడు
సుడులు తిరిగే దుఃఖము
మరిగి చూడు మరిగి చూడు
మనిషి వేసే వేషము
పుణ్యపుడమిలో పరిడవిల్లిన
మేధ లేదిపుడెందుకో
ధన్య ధరణిలో నెత్తుటేరులు
పారుతున్నది ఎందుకో
తరతరాల దండయాత్రల
దారుణాలను తెలుసుకో
గాయపడిన భరతజాతికి
వైద్యమేదో చదవుకో
రగిలి చూడు రగిలి చూడు
రాలుతున్న పూలను
పగిలి చూడు పగిలి చూడు
గుండె పగిలిన నేలను
తిరిగి చూడు తిరిగి చూడు
తిరుగుతున్న భూమినీ
కలిసి చూడు కలిసి చూడు
మనిషిలోని మనిషినీ
Thirigi Chudu Lyrics
Thirigi choodu thirigi choodu
Thiruguthunna bhoominee
Kalisi choodu kalisi choodu
Manishiloni manishinee
Nadachi vacchina paadamudralu
Cheripivesina shakthulevo
Velugunicchina gnanajyothulanaarpinaa
Kuyukthulevo
Anachivethaku aajyamaina
Kaaranaalanu thelusuko
Thirigi choodu thirigi choodu
Thiruguthunna bhoominee
Kalisi choodu kalisi choodu
Manishiloni manishinee
Mahilalantu purushulantu
Maanavaalini veruchesee
Abalavantu addamicchi
Andamaina bhramala thosee
Sampradaayapu musugu vesina
Vaaru yevaro thelusuko
Indrachaapam rangu maapina
Vaaru yevaro kalusuko
Tharachi choodu tharachi choodu
Vaadipoyina maguvanu
Thagili choodu thagili choodu
Boodidaina theguvanu
Agra varnamu ninna varnamu
Antu manalanu veruchesee
Swardha beejamulevo naati
Viswabhavana kaalaraasee
Kotladevula peru cheppi
Korivi pettinadevvaro
Bhakthi peruna janamu nadiche
Rachana chesinadevvaro
Tharali choodu tharali choodu
Shilala mokke prajalanu
Marali choodu marali choodu
Goodu kattina digulunu
Veta kodavali chethapatti
Rakthapaathapu daadulenno
Baala bhavithanu chidimi vese
Daastikaala charyalenno
Janyuvulalo vishamu nimpina
Kapati yevaro thelusuko
Maanyulantu manalanele
Kutradaarula kalusuko
Pogili choodu pogili choodu
Sudulu thirige dukhamu
Marigi choodu marigi choodu
Manishi vese veshamu
Punyapudamilo paridavillina
Medha ledhipudenduko
Dhanya dharanilo netthuterulu
Paaruthunnadi enduko
Tarataraala dandayaatrala
Daarunalanu thelusuko
Gaayapadina bharathajaathiki
Vaidyamedho chaduvuko
Ragili choodu ragili choodu
Raaluthunna poolanu
Pagili choodu pagili choodu
Gunde pagilina nelanu
Thirigi choodu thirigi choodu
Thiruguthunna bhoominee
Kalisi choodu kalisi choodu
Manishiloni manishinee