Baanam Pattu lyrics, బాణం పట్టు the song is sung by L. V. Revanth from Missing. Baanam Pattu Sad soundtrack was composed by Ajay Arasada with lyrics written by Vasishta Sharma.
బాణం పట్టు Lyrics in Telugu
బాణం పట్టు వేటాడి చంపేటట్టు
ప్రాణం పోదే నీ ఊహలనే దాటి
మంటే పెట్టు ఒళ్ళంతా కాలేటట్టు
అయినా రాదే ఈ బాధకు పోటీ
గుండెలో దిగులు పెంచుతూ సెగలు
నిన్నలో బ్రతకమంటున్నా
నిన్నిలా తలచి రేపు
నే కొలిచి నీకోసం వస్తున్నా
కళ్ళలో కదులు ప్రశ్నలే సుడులు
ఉప్పెనై ముంచుకొస్తున్నా
బదులేదంటూ ఎదురీదనా
నా ప్రాణం ఏమైనా ఏదేమైనా
నీ కోసం ఏదేమైనా ఎందాకైనా పోరాడనా
ఒక్కో ఊపిరినే కలిపి జీవిస్తూనే ఉన్నా
భారత్ల్య్రిక్స్.కోమ్
నన్నే చూస్తూ ఉంది నిలువుగ పగిలిన అద్దం
పరిహాసం చేస్తుంది పది ముక్కల్లోనా ప్రతిబింబం
ఏం చేద్దామంది ఎటుకో తెలియని గమ్యం
ప్రతి దారి నవ్వింది ప్రతిసారి చేస్తూ మోసం
చిక్కే విడదీస్తున్నా… చిక్కే పడుతున్నా
చిక్కుల్లో పడిపోతూ ఉన్నా
ఆటే ఆడిస్తున్న బాటే బంధిస్తున్నా
నీకోసం నేనొస్తున్నా
నా ప్రాణం ఏమైనా ఏదేమైనా
నీ కోసం ఏదేమైనా
ఎందాకైనా పోరాడనా
ఉన్నా, ఉన్నానో లేదో సందేహంలో ఉన్న
సందేహం దాచింది తనలోనే సంకేతం
సరిగా చూదంటుంది కళ్ళల్లో నిండిన భూతద్దం
వేగం పెంచింది గమనిస్తూ ఆరాటం
సమయం లేదంటుంది గంటలు కొట్టే గడియారం
ఆపేది ఎవరైనా ఆపాలనుకున్నా
ఆ ప్రాణం తీసేయ్ నా
కాలం కాదంటున్న నాకే సొంతం
అయినా నిన్నొది నేనుంటానా
నా ప్రాణం ఏమైనా ఏదేమైనా
నీ కోసం ఏదేమైనా
ఎందాకైనా పోరాడనా
ఉన్న ప్రతినిమిషం చస్తూ
మళ్ళీ పుడుతూ, ఉన్నా