చెల్లెమ్మా Chellemma Lyrics - Ritesh G Rao

Chellemma lyrics, చెల్లెమ్మా the song is sung by Ritesh G Rao from Bro. Chellemma Love soundtrack was composed by Shekar Chandra with lyrics written by Bhaskarabhatla Ravi Kumar.

చెల్లెమ్మా Lyrics in Telugu

నీ చిన్నిపాదం… అడుగేయగానే
ఉప్పొంగిపోయింది నా ప్రాణమూ
నీ నవ్వుదీపం… వెలిగించగానే
వొదిలేసిపోయింది ఒంటరితనమూ

తొలిసారి నిన్ను… చేతుల్లొమోసీ
ముడివేసుకున్నాను తీపిబంధమూ

చెల్లెమ్మా నువ్వు పుట్టాకే
అన్నలా నేనుపుట్టానే
వందజన్మలూ… వేయిజన్మలూ
తోడుగా నీకువుంటానే

చెల్లెమ్మా నువ్వు వచ్చాకే
గుండెకే సందడొచ్చిందే
దారిచూపే వేలిచివరై
నిన్ను నడిపిస్తూవుంటానే

నే ఎపుడూ కలలే కననీ
ఓ వరమై ఎదురే నిలిచావే
జాబిల్లిని నీకోసం తెద్దామంటే
నువ్వేఒక జాబిలిలా వున్నావు తెలుసా

నీకోసం నా ఒడిని… ఉయ్యాల చేస్తానూ
నిదరొచ్చి బజ్జుంటే… జోలాలీ అవుతానూ
నీ బుజ్జి పిడికిట్లో… దాచేసుకుంటాను
నా పంచప్రాణాలనీ…

చెల్లెమ్మా నువ్వు పుట్టాకే
అన్నలా నేనుపుట్టానే
వందజన్మలూ వేయిజన్మలూ
తోడుగా నీకువుంటానే

bharatlyrics.com

చెల్లెమ్మా నువ్వు వచ్చాకే
గుండెకే సందడొచ్చిందే
దారిచూపే వేలిచివరై
నిన్ను నడిపిస్తూవుంటానే

నీ చిన్నిపాదం… అడుగేయగానే
ఉప్పొంగిపోయింది నా ప్రాణమూ

ఆ నదికే పరుగే వస్తే
నీలాగే వుంటుందే బహుశా
నీ అల్లరి చూసిందో సీతాకోకా
నీ స్నేహం కావాలని రాదా నీ వెనకా

కోతి కొమ్మచ్చాట ఆడేసుకుందాము
ఇసుక లోన గూళ్ళు కట్టేసుకుందాము
తిట్టేసుకుందాము కొట్టేసుకుందాము
కలిసీపోదాము

చెల్లెమ్మా నువ్వు పుట్టాకే
అన్నలా నేనుపుట్టానే
వందజన్మలూ వేయిజన్మలూ
తోడుగా నీకువుంటానే

చెల్లెమ్మా నువ్వు వచ్చాకే
గుండెకే సందడొచ్చిందే
దారిచూపే వేలిచివరై
నిన్ను నడిపిస్తూవుంటానే.

Chellemma Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Chellemma is from the Bro (2021).

The song Chellemma was sung by Ritesh G Rao.

The music for Chellemma was composed by Shekar Chandra.

The lyrics for Chellemma were written by Bhaskarabhatla Ravi Kumar.

The music director for Chellemma is Shekar Chandra.

The song Chellemma was released under the Mango Music.

The genre of the song Chellemma is Love.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *