దేవనాయకి Devanayaki Lyrics in Telugu
సదువు సదువు అని అన్నాడు మా నాన్న
సదువు అబ్బలేదు గానీ సరసం అబ్బిందోయ్
పని చేయ్ పని చేయ్ అన్నాది మా యమ్మ
పనులబ్బలేదు గానీ పరువం అబ్బిందోయ్..
కొట్టం వ్యవసాయం.. కుట్టు వ్యాపారం
కుట్ర పన్నాగం గట్రా యవ్వారం
కొట్టం వ్యవసాయం.. కుట్టు వ్యాపారం
కుట్ర పన్నాగం గట్రా యవ్వారం
అయ్యేయి లేవు గానీ ఉన్నదొకటే వయ్యారం
దేనికే అవి దేనికే అవి.. దేవనాయకి
దేనికే అవి దేనికే అవి.. దేవనాయకి
దేవుడిచ్చిన జీవితానికి..
దేవుడిచ్చిన జీవితానికి
అందచెందమే.. అందచెందమే
ఆస్తి కాదటే ఆడదానికి
అప్పగించేయ్ నమ్మినోళ్లకే
అప్పగించేయ్ నమ్మినోళ్లకే
పది పాసయ్యాక పక్క దారి పట్టానోయ్
పదకొండు క్లాసుకి పంగనామమెట్టానోయ్
భలే చేస్తివే.. బల్ భలే చేస్తివే.. బరి తెగించేస్తివే
భలే చేస్తివే.. బల్ భలే చేస్తివే.. బరి తెగించేస్తివే
ఫీజుల డబ్బు తెచ్చి ఫ్యాషన్‌లకి పోశానోయ్
బిల్లులు కట్టమంటే బికినీలూ కొన్నానే..
బడాయెందుకే.. ఆ బడాయెందుకే
దివాళెందుకు..దివ్ దివాళెందుకే..
రేవు కాడ ర్యాంపు వాకు..
కొట్ల కాడ క్యాటు వాకు
ఇన్ స్టాగ్రాం రీలు పెట్టి
ఇన్ ఫ్లూయెన్సరయ్యానోయ్..
రేవు కాడ ర్యాంపు వాకు
కొట్ల కాడ క్యాటు వాకు
ఇన్ స్టాగ్రాం రీలు పెట్టి
ఇన్ ఫ్లూయెన్సరయ్యానోయ్
పొదలల్ల ఫోటో షూట్లు,ప్రోగ్రాంలు, ప్రమోషన్స్
పెద్ద పెద్ద వాళ్ల పరిచయాలు ఒక దెబ్బకి
ఎంత జానవే.. ఎంత జానవే..
ఎంత జానవే దేవనాయకి
ఎదిగిపోయావ్.. అంతకంతకి..
ఎదిగిపోయావ్.. అంతకంతకి..
భారత్ల్య్రిక్స్.కోమ్
జిమ్ ట్రైనర్‌తో వర్కౌట్లు చేశానోయ్
జిమ్ ఓనర్‌కే వర్కౌట్ అయిపోయానోయ్
బలైపోతాడే బలైపోతడే
పిడైపోతడే ర్యాపడైపోతడే
స్విమ్మింగు నేర్చుకుని స్లిమ్ అవుతానన్నానోయ్
స్విమ్మింగు కోచుకలా స్లిమ్ ఫుట్ అయ్యానోయ్
తడైపోతడే..ఇత్తడైపోతడే..
పొడైపోతడే.. పొడైపోతడే
ఫేస్ బుక్కు ఫేషియల్ ఫేస్ క్రీమ్ మెయింటైన్స్
వీరమాచినేని టైపు.. పైన స్కిన్ను టైటు
ఎదురొచ్చే గోదారికి ఎదురెళ్లి ఎదురీది
ఇలస నుంచి పులసనయ్యా ఇంచు ఇంచుకి
ఈదులాడి ఈదులాడి దేవనాయకి
ఇలస పులసయ్యావా దేవనాయకి
ఇలస పులసయ్యావా దేవనాయకి
దేనికే అవి దేనికే అవి.. దేవనాయకి
దేనికే అవి దేనికే అవి.. దేవనాయకి
దేవుడిచ్చిన జీవితానికి..
దేవుడిచ్చిన జీవితానికి
అందచెందమే.. అందచెందమే
ఆస్తి కాదటే ఆడదానికి
అప్పగించేయ్ నమ్మినోళ్లకే
అప్పగించేయ్ నమ్మినోళ్లకే.
