Kurravada Kurravada lyrics, కుర్రవాడ కుర్రవాడ the song is sung by Nutana Mohan from 10th Class Diaries. Kurravada Kurravada Happy soundtrack was composed by Suresh Bobbili with lyrics written by Kasarla Shyam.
Kurravada Kurravada Song Lyrics
Kannullona dacha ninnu
Roju edutane chudaga
Swsallona mosa ninnu
Nuvve na thodai raga
Vintunna ninnate
Guruthulanni talachukuntu
Neetho prathi nimisham untu
Tirigesthunna ni
Cheyi nenu pattukuntu
Nee kalalenno kantu
Kurravada kurravada
Nuvve adugu jada
Gunde goda meeda unna
Bomma needira
Kurravada kurravada
Nuvve velugu needa
Manasu ninda poolu puse
Komma nuvvura
Mabbylo sinuke mannylona molakalesele
Duramai unna ningi nela ekamayyele
Chinnari challagaali
Undundi meeda vali
Nee vechanaina
Upirudhe ippude
Sannanga manchu rali
Na kurula paina teli
Nelaga allaredho
Chese guppede
Nuv eppudochina teliyadu
Chappudaina cheyakunda
Reppalu musinavule
O kotha lokame malli
Premalona chuputunte
Cheekataina naku
Panducennele
Kurravada kurravada
Nuvve adugu jada
Gunde goda meeda unna
Bomma needira
Kurravada kurravada
Nuvve velugu needa
Manasu ninda poolu puse
Komma nuvvura
Cheekate kade veekuve vastundile
Girruna tirige bhoomi meede gelupundile
Nee vellu takinatti
Aa pustakaalu talli
Akasamandukonu rekkalochene
Aashalni mula katti
Pakkanne kurchobetti
Nuvvanna matalanni batalayyene
Nuv chentha levane sangathi
Intha kuda gurthu radu
Naa oohalanni neevile
Okkasari ne chadivithe
Marchiponu paatamaina
Pranametlaa nenu maruvagalanule
Kurravada kurravada
Nuvve adugu jada
Gunde goda meeda unna
Bomma needira
Kurravada kurravada
Nuvve velugu needa
Manasu ninda poolu puse
Komma nuvvura.
కుర్రవాడ కుర్రవాడ Lyrics in Telugu
కన్నుల్లోనా దాచా నిన్ను
రోజూ ఎదుటనే చూడగా
శ్వాసల్లోనా మోసా నిన్ను
నువ్వే నాతోడై రాగా
వింటున్నా నిన్నటి
గురుతులన్ని తలచుకుంటూ
నీతో ప్రతి నిమిషం ఉంటూ
తిరిగేస్తున్నా నీ
చేయి నేను పట్టుకుంటు
నీ కలలెన్నో కంటూ
కుర్రవాడ కుర్రవాడ
నువ్వే అడుగుజాడ
గుండె గోడ మీద ఉన్న
బొమ్మ నీదిరా
కుర్రవాడ కుర్రవాడ
నువ్వే వెలుగు నీడ
మనసు నిండా పూలు పూసే
కొమ్మ నువ్వురా
మబ్బులో సినుకే మన్నులోన మొలకలేసెలే
దూరమై ఉన్న నింగి నేల ఏకమయ్యెలే
చిన్నారి చల్లగాలి
ఉండుండి మీద వాలి
నీ వెచ్చనైన
ఊపిరూదే ఇప్పుడే
సన్నంగ మంచు రాలి
నా కురులపైన తేలి
నీలాగ అల్లరేదో
చేసే గుప్పెడే
నువ్ ఎప్పుడొచ్చినా తెలియదు
చప్పుడైనా చేయకుండా
రెప్పలు మూసినావులే
ఓ కొత్త లోకమే మళ్ళీ
ప్రేమలోన చూపుతుంటే
చీకటైనా నాకు
పండువెన్నెలే
కుర్రవాడ కుర్రవాడ
నువ్వే అడుగుజాడ
గుండె గోడ మీద ఉన్న
బొమ్మ నీదిరా
కుర్రవాడ కుర్రవాడ
నువ్వే వెలుగు నీడ
మనసునిండా పూలు పూసే
కొమ్మ నువ్వురా
చీకటే కాదే వేకువే వస్తుందిలే
గిర్రున తిరిగే భూమి నీదే గెలుపు ఉందిలే
నీ వేళ్ళు తాకినట్టి
ఆ పుస్తకాలు తట్టి
ఆకాశమందుకోను రెక్కలొచ్చెనే
ఆశల్ని మూటకట్టి
పక్కన్నే కూర్చోబెట్టి
నువ్వన్న మాటలన్నీ బాటలయ్యెనే
నువు చెంత లేవనే సంగతి
ఇంత కూడా గురుతు రాదు
నా ఊహలన్ని నీవిలే
ఒక్కసారి నే చదివితే
మరచిపోను పాఠమైన
ప్రాణమెట్లా నేను మరువగలనులే
కుర్రావాడ కుర్రవాడ
నువ్వే అడుగుజాడ
గుండె గోడ మీద ఉన్న
బొమ్మ నీదిరా
bharatlyrics.com
కుర్రావాడ కుర్రవాడ
నువ్వే వెలుగు నీడ
మనసు నిండా పూలు పూసే
కొమ్మ నువ్వురా.