Naa Guppedantha lyrics, నా గుప్పెడంత the song is sung by Ishaq Vali from Black. Naa Guppedantha Love soundtrack was composed by Suresh Bobbili with lyrics written by Purna Chari.
నా గుప్పెడంత Lyrics in Telugu
నా గుప్పెడంత గుండెకింతా
చెప్పలేని వేగమంటా, వేగమంటా
ఎందుకంటా..?, ఎందుకంటా
నీ రాకతోనే మారిపోయి
మళ్ళీ నేను పుట్టేనంట, పుట్టేనంట
ఎందుచేత..? ఎందుచేతా..?
కరగనీ ఈ సమయం
పెరగని నీ స్నేహం
కుదురుగా లేకుందే ఏమో నా ప్రాణం
ఇంతకీ సమయం ఆపదే ఈ పయనం
చనువునే పెంచిందే నీతో ఏకాంతం
ఉన్నట్టుగా మేఘాలపై ఇలా
నా పాదమే తేలింది ఏంటిలా
తూనీగలా రాగాలు పాడుతూ
నేనింతగా నీ మాయలో ఉండనా
కలలకు కన్నులు మొలిచాయిలా
మనసుకు రెక్కలు పొడిచాయా
పెదవులు మాటలు మరిచాయిగా
ఈ వింత నీదేనుగా
ఎగిరి నింగి తాకుదాం
ఎదురే లేని తీరుగా
ఎవరు లేని చోటులో
ఎపుడూ తోడు నేనుగా
ఎగిరి నింగి తాకుదాం
ఎదురే లేని తీరుగా
ఎవరు లేని చోటులో
ఎపుడూ తోడు నేనుగా
నా గుప్పెడంత గుండెకింతా
చెప్పలేని వేగమంటా, వేగమంటా
ఎందుకంటా..?, ఎందుకంటా
నీ రాకతోనే మారిపోయి
మళ్ళీ నేను పుట్టేనంట, పుట్టేనంట
ఎందుచేత..? ఎందుచేతా..?
bharatlyrics.com
తగువులే చెలిమిగా మారెనే నేడిలా
అడుగులే ఒకటిగా సాగినాయే
అతిథిలా ఉండగా హృదయమే చాలదా
వెలితినే తీర్చిన వెలుగు నీవే
నీ తీరమే కోరి నా దారులే
నీ వైపుగా కదిలాయిగా
నీ నవ్వుకే బదులిచ్చానుగా
ఇపుడే ఇలా కలిసినా
ముందున్న కాలం ఏమున్నదో
నీతోటి నాకే రాసున్నదో
నామాటగా నన్ను ఇచ్చానుగా
కలా నిజం కలిసినట్టుగా
కలలకు కన్నులు మొలిచాయిలా
మనసుకు రెక్కలు పొడిచాయా
పెదవులు మాటలు మరిచాయిగా
ఈ వింత నీదేనుగా
ఎగిరి నింగి తాకుదాం
ఎదురే లేని తీరుగా
ఎవరు లేని చోటులో
ఎపుడూ తోడు నేనుగా
ఎగిరి నింగి తాకుదాం
ఎదురే లేని తీరుగా
ఎవరు లేని చోటులో
ఎపుడూ తోడు నేనుగా
నా గుప్పెడంత గుండెకింతా
చెప్పలేని వేగమంటా, వేగమంటా
ఎందుకంటా..? ఎందుకంటా
నీ రాకతోనే మారిపోయి
మళ్ళీ నేను పుట్టేనంట, పుట్టేనంట
ఎందుచేత..? ఎందుచేతా.