నిప్పురవ్వ రగిలింది Nippuravva Ragilindhi Lyrics - Kaala Bhairava

Nippuravva Ragilindhi lyrics, నిప్పురవ్వ రగిలింది the song is sung by Kaala Bhairava from Uniki. Nippuravva Ragilindhi soundtrack was composed by P.R (Peddapalli Rohith) with lyrics written by P.R (Peddapalli Rohith).

నిప్పురవ్వ రగిలింది Lyrics in Telugu

bharatlyrics.com

నిప్పురవ్వ రగిలింది చూడు
నిబ్బరంగా నడిచింది నేడు
నిన్ను తాకే ఏ పెనుగాలి
ఎదురు పడదు ఇక ఆగాలి

నింగి కూడా తలవంచును చూడు
నేల నిన్ను నడిపించును ముందు
శత్రువైన వెనకుండాలి
చిరుతలాగ నువ్వు సాగాలి

కన్నీళ్ళనీ రానివ్వద్దని
రైతుల పక్షం నిలిచావు
కన్నోళ్ళతో సమానమంటూ
తోడున్నావు నువ్వు

ఇన్నాళ్ళుగా మారని బతుకులు
మార్చేస్తానని అన్నావు
ఎన్నేళ్ళనీ వెతికామో
మా తల్లిగా నువ్వొచ్చావు

సంద్రం హోరును వింటూ
వెనకడుగేయవు నువ్వు
తీరం చేరే అలలా
పడి లేస్తావు ఆగవు

మౌనం మాటలు సందిస్తూ
యుద్ధాన్నే మొదలెడతావు
ప్రశ్నల తూటాలను నింపి
తప్పుకి గురిపెడతావు

నిప్పురవ్వ రగిలింది చూడు
నిబ్బరంగా నడిచింది నేడు
నిన్ను తాకే ఏ పెనుగాలి
ఎదురు పడదు ఇక ఆగాలి

నింగి కూడా తలవంచును చూడు
నేల నిన్ను నడిపించును ముందు
శత్రువైన వెనకుండాలి
చిరుతలాగ నువ్వు సాగాలి

అన్నంపెట్టే చేతిని
అమ్మని అనుకోవాలని
అది పండించే రైతుని
దైవం అని పిలవాలని

అందరి బాధల బరువుని
మోసే పుడమి నువ్వని
అందరి పెదవుల నవ్వుని
కోరే మనసే నీదని

సాగు భూములకైనా
సాగే పోరేదైనా
ముందే నువ్వుండే
తెగువే ఆదర్శం

మేఘమేది రాకున్నా
మూగబోయిన గొంతైనా
నువ్వే కురిపించే వానేగా సాయం

నిప్పురవ్వ రగిలింది చూడు
నిబ్బరంగా నడిచింది నేడు
నిన్ను తాకే ఏ పెనుగాలి
ఎదురు పడదు ఇక ఆగాలి

నింగి కూడా తలవంచును చూడు
నేల నిన్ను నడిపించును ముందు
శత్రువైన వెనకుండాలి
చిరుతలాగ నువ్వు సాగాలి

పల్లెకు పట్టెడు బతుకునీ
ఎండిన కడుపుకి నీళ్ళనీ
చేరువ చేసే తెగువనీ
జనమంతా చూస్తారని

అండగ నిలిచే తోడునీ
నిండుగా కళ్ళతో చూడనీ
కష్టం అంటే నువ్వుండే
మనసును అనరా దైవమని

కంచెలెన్ని ఉన్నా కంచుకోటలైనా
కాగడాల నీడ ముందు వాలి కూలిపోవా
కారుమబ్బులైనా కాచుకుంటూ ఉన్నా
కొంచమైనా జంకు లేక కావలి ఉన్నావా

నిప్పురవ్వ రగిలింది చూడు
నిబ్బరంగా నడిచింది నేడు
నిన్ను తాకే ఏ పెనుగాలి
ఎదురు పడదు ఇక ఆగాలి

నింగి కూడా తలవంచును చూడు
నేల నిన్ను నడిపించును ముందు
శత్రువైన వెనకుండాలి
చిరుతలాగ నువ్వు సాగాలి.

Nippuravva Ragilindhi Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download