వినవే వినవే మనసా Vinave Vinave Manasa Lyrics - Mangli

Vinave Vinave Manasa lyrics, వినవే వినవే మనసా the song is sung by Mangli from Mangli Official. Vinave Vinave Manasa Folk soundtrack was composed by Baji with lyrics written by Narahari.

వినవే వినవే మనసా Lyrics in Telugu

bharatlyrics.com

వినవే వినవే వెర్రి మనసా
నీకు వేదాంతమేమందో తెలుసా
పక్షి ఏమని పలికిందో తెలుసా
పలుకులో మెలిక ఏముందో తెలుసా

వినవే వినవే వెర్రి మనసా
నీకు వేదాంతమేమందో తెలుసా
పక్షి ఏమని పలికిందో తెలుసా
పలుకులో మెలిక ఏముందో తెలుసా

కావు కావన్నది కాకి
దానికర్ధమేమన్నాడు అవివేకి
కావు కావన్నది కాకి
గుడి మీద కూర్చోని కావుకావంటెను
కాపాడమని వేడుకొన్నాది

గుడి మీద కూర్చోని కావుకావంటెను
కాపాడమని వేడుకొన్నాది

మేడ మిద్దెల మీద కూర్చోని కావంటే
మేడ మిద్దెల మీద కూర్చోని కావంటే
నిజము కావు కావివి నీకు శాశ్వతము కావంది

వినవే వినవే వెర్రి మనసా
నీకు వేదాంతమేమందో తెలుసా
పక్షి ఏమని పలికిందో తెలుసా
పలుకులో మెలిక ఏముందో తెలుసా

కొక్కొరొకోయంది కోడి
వివరమిడదీయమన్నాది విరి బోడి
కొక్కొరొకోయంది కోడి
వేకువజామున కొక్కొరొకోయంటే
ఇక నిద్ర మేలుకోమన్నాది

వేకువజామున కొక్కొరొకోయంటే
ఇక నిద్ర మేలుకోమన్నాది

తెల్లవారిన వేళ కొక్కొరొకోయంటే
తెల్లవారిన వేళ కొక్కొరొకోయంటే
బతుకు తెల్లవారక ముందే తెలుసుకోమన్నాది

వినవే వినవే వెర్రి మనసా
నీకు వేదాంతమేమందో తెలుసా
పక్షి ఏమని పలికిందో తెలుసా
పలుకులో మెలిక ఏముందో తెలుసా

కిలకిలామన్నాది చిలక
దాని పలుకులో ఏముందో ఎరుకా
కిలకిలామన్నాది చిలక
కొమ్మల్లో రెమ్మల్లొ కిలకిలాయంటేను
కమ్మగా బ్రతుకిలా అన్నాది

కొమ్మల్లో రెమ్మల్లొ కిలకిలాయంటేను
కమ్మగా బ్రతుకిలా అన్నాది

పంజరంలో నుండి కిలకిలాయంటేను
పంజరంలో నుండి కిలకిలాయంటేను
నాకు బంధికాన బ్రతుకు ఎందుకిలా అన్నాది

వినవే వినవే వెర్రి మనసా
నీకు వేదాంతమేమందో తెలుసా
పక్షి ఏమని పలికిందో తెలుసా
పలుకులో మెలిక ఏముందో తెలుసా

వినవే వినవే వెర్రి మనసా
నీకు వేదాంతమేమందో తెలుసా
పక్షి ఏమని పలికిందో తెలుసా
పలుకులో మెలిక ఏముందో తెలుసా.

Vinave Vinave Manasa Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Vinave Vinave Manasa is from the Mangli Official.

The song Vinave Vinave Manasa was sung by Mangli.

The music for Vinave Vinave Manasa was composed by Baji.

The lyrics for Vinave Vinave Manasa were written by Narahari.

The music director for Vinave Vinave Manasa is Baji.

The song Vinave Vinave Manasa was released under the Mangli Official.

The genre of the song Vinave Vinave Manasa is Folk.