నీది కానీ రూపమేది Needi Kaani Rupamedi Lyrics - Mangli

Needi Kaani Rupamedi lyrics, నీది కానీ రూపమేది the song is sung by Mangli from Mangli Official. Needi Kaani Rupamedi Maha Shivratri soundtrack was composed by Suresh Bobbili with lyrics written by Mittapalli Surender.

నీది కానీ రూపమేది Lyrics in Telugu

నీది కానీ రూపమేది లేదు దేవా ఈ సృష్టిలో
ఎల్లలోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో
నీది కానీ రూపమేది లేదు దేవా ఈ సృష్టిలో
ఎల్లలోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో

విశ్వమైనా భస్మమైనా… నీవే
విశ్వమైనా భస్మమైనా ఆది అంతం నీవే

నీది కానీ రూపమేది లేదు దేవా ఈ సృష్టిలో
ఎల్లలోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో

దీంతాన దీంతాన దిరనన
దీంతాన దీంతాన దిరనన
దీంతాన దీంతాన దిరనననా

నింగిలో నాదము గాలిలో ప్రాణము
నీటిలో జీవము అగ్నిలో దీపము
మట్టితో దేహము ప్రాణికో రూపము
జగతినే పెంచుతూ పంచినా దైవమా

జననమైనా మరణమైనా… నీవే
జననమైనా మరణమైనా నీవె ఆధారం
శూన్యమైనా శివశివా నీవే ఆకారం

హరహర మహాదేవ హిమగిరి వాస
ఆదియోగివై వెలసిన ఈశా…

ఆగిపోని కాలమందు అల్లుతావు బంధం… ఓ దేవా
ఆగిపోయే ఊపిరిచ్చి తెంచేవు ప్రాణం
అంతులేని ఆశలోనే బ్రతుకు నిత్య వేట
యాడవుండి ఆడుతావు ఇంత వింత ఆట

నిజము నీవే భ్రమవు నీవే… ఈశా…
నిజము నీవే భ్రమవు నీవే అంతటా నీవే
అంతరంగం అందనీయవు అర్థనారీశా

నీది కానీ రూపమేది లేదు దేవా ఈ సృష్టిలో
ఎల్లలోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో

bharatlyrics.com

హర హర హర హర… మహాదేవ
దేవాఈశా… దేవా… దేవా
హర హర హర హర… మహాదేవ
దేవాఈశా… దేవా… దేవా
హర హర హర హర… మహాదేవ
దేవాఈశా… దేవా… దేవా
హర హర హర హర… మహాదేవ
దేవాఈశా… దేవా… దేవా

హర హర హర హర… మహాదేవ
దేవాఈశా… దేవా… దేవా
హర హర హర హర… మహాదేవ
దేవాఈశా… దేవా… దేవా
హర హర హర హర… మహాదేవ
దేవాఈశా… దేవా… దేవా
హర హర హర హర… మహాదేవ
హర హర హర హర… మహాదేవ.

Needi Kaani Rupamedi Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download