BINDHE MIDHA BINDHEVETTI SONG LYRICS: This new Folk Telugu song is sung by Nagavva & released by Vaidika Music. BINDHE MIDHA BINDHEVETTI song was composed by Thirupathi Saaho, with lyrics written by Thirupathi Saaho.
బిందె మీద బిందె పెట్టి Lyrics Lyrics in Telugu
బిందె మీద బిందె పెట్టి నీలాభవంతిలో
పూల భవంతిలో
ఎవరింటి బిడ్డేవమ్మ నీలాభవంతిలో
పూల భవంతిలో
బిందె మీద బిందె పెట్టి నీలాభవంతిలో
పూల భవంతిలో
షేరుదారు సెల్లేనమ్మ నీలాభవంతిలో
పూల భవంతిలో
భారత్ల్య్రిక్స్.కోమ్
సిమ్మని చీకటిలోనా ఎన్నెల రాతిరిలోనా
సిక్కుకుంటిని నేను వాని బిగి కౌగిలిలా…
ముద్దులియమని రాతిరి అచ్చెని కలలా
వాని శ్వాసలు తగిలి జ్వరం వచ్చేనె పైలా..
సోకులన్నీ దోచుకొనే
చక్కని చిన్నోని కోసం
గురిగి మీద గురిగి పెట్టి నీలాభవంతిలో
పూల భవంతిలో…
గురిగి తాటు ముచ్చటేందో నీలాభవంతిలో
పూల భవంతిలో…
ఆకుపచ్చ చీరెను కట్టి అద్దాల రైకను తొడిగి
జడలోన మల్లెలు పెట్టి ఎర్రలున్న అత్తరు కొట్టి
కాటుక పెట్టిన జూడు నల్లని కళ్ళకు నేడు
ఎదురు చూస్తిని నేను ఎదలో తలచితి నిన్ను
కంటికైనా కనరాడు
కలలోన చెందురుడు
చింగుల మీద చింగుల వాల్చి నీలాభవంతిలో
పూల భవంతిలో…
చింగుల మీద చిలకలాలే నీలాభవంతిలో మల్ల
పూల భవంతిలో…
రంగు రంగుల బంగ్లా రామ చక్కని బంగ్లా
పాల పురకలు తెచ్చి పచ్చని పందిరులేసి
బాజాల చప్పుడు తోటి తోరాళ్లను కట్టి
మైల పూలును వేసి పెళ్లి పిల్లనూ చేసి
కాయమైనోడి కోసం కన్ను
మూయకుండా కాపలా కాసి
బంగ్లా మీద బంగ్లా కట్టి నీలాభవంతిలో సిరి
మేడల భవంతిలో…
బంగ్లా లోపట పాలరాళ్ళు నీలాభవంతిలో
నీ వాడే భవంతిలో.
