ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల Ekkada Untadhiro Aa Pilla Lyrics - Dhanunjay

Ekkada Untadhiro Aa Pilla lyrics, ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల the song is sung by Dhanunjay from Manu Charitra. Ekkada Untadhiro Aa Pilla Dance soundtrack was composed by Gopi Sundar with lyrics written by Chandrabose.

ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల Lyrics in Telugu

ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల
ఏ సోట ఉంటాదిరో
ఏ గల్లీలుంటాదిరో ఆ ఇల్లు
ఏ సందులుంటాదిరో

ఎవ్వరినడగాలిరో అడ్రస్సు
ఏ దారి నడవాలిరో
ఇల్లెపుడు దొరికేనురో
మా వాడి దిల్లెపుడు మురిసేనురో

హే, ఓరుగళ్ళు మొత్తం జల్లెడ పట్టేద్దాం
హే, ఖాజిపేట మొత్తం కలియ చుట్టేద్దాం
హన్మకొండ అణువణువు అన్వేషించేద్దాం
అందగత్తె ఆచూకీని ఆరా తీసేద్దాం

అరె జెన్నీ నా ప్రాణం
చిన్నీ నా లోకం
జెన్నీ లక్ష్యంగా జర్నీ చేసేద్దాం

ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల
ఏ సోట ఉంటాదిరో
ఏ గల్లీలుంటాదిరో ఆ ఇల్లు
ఏ సందులుంటాదిరో

హే, ఓరుగళ్ళు మొత్తం జల్లెడ పట్టేద్దాం
హే, ఖాజిపేట మొత్తం కలియ చుట్టేద్దాం

మనసే దోచిన పోరిది
మండీ బజారేనా,
బతుకే మార్చిన పిల్లది
బట్టల బజారేనా

బ్రహ్మ గారి ముద్దుల గుమ్మది
బ్రాహ్మణ వాడేనా, ఆహా
తిక్క నాకు పెంచిన చుక్కది
నక్కలగుట్టేనా

వేయిస్తంభాల గుల్లోన
కొలువైన మా దేవుడా
అరె గుడిలాంటి ఆ పిల్ల
ఇల్లేదో చూపించరా, అహా అహా అహా

ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల
ఏ సోట ఉంటాదిరో
ఏ గల్లీలుంటాదిరో ఆ ఇల్లు
ఏ సందులుంటాదిరో

హే, ఓరుగళ్ళు మొత్తం జల్లెడ పట్టేద్దాం
హే, ఖాజిపేట మొత్తం కలియ చుట్టేద్దాం

ప్రేమ దేవి నివసించేది పోచమ్మైదానేనా
రాణి గారు నడియాడేది రాగన్న ధర్వాజేనా

భారత్ల్య్రిక్స్.కోమ్

వెలుగులెన్నో చిలికిన చిలకది
ములుగు రోడ్డేనా, ఆహా
వడ్డీ లాగ పెరిగిన వలపుది
వడ్డేపల్లేనా, ఆహ

భద్రకాళమ్మ భద్రంగా
ఆ చోటు చూపించమ్మా
మాకు పుట్టేటి పాపాయికి
నీ పేరు పెడతామమ్మా

ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల
ఏ సోట ఉంటాదిరో
ఏ గల్లీలుంటాదిరో ఆ ఇల్లు
ఏ సందులుంటాదిరో

హే, ఓరుగళ్ళు మొత్తం జల్లెడ పట్టేద్దాం
హే, ఖాజిపేట మొత్తం కలియ చుట్టేద్దాం
హన్మకొండ అణువణువు అన్వేషించేద్దాం
అందగత్తె ఆచూకీని ఆరా తీసేద్దాం

అరె జెన్నీ నా ప్రాణం
చిన్నీ నా లోకం
జెన్నీ లక్ష్యంగా జర్నీ చేసేద్దాం

ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల
ఏ సోట ఉంటాదిరో
ఏ గల్లీలుంటాదిరో ఆ ఇల్లు
ఏ సందులుంటాదిరో, ఆహ

ఎవ్వరినడగాలిరో అడ్రస్సు
ఏ దారి నడవాలిరో ఆహా
ఇల్లెపుడు దొరికేనురో
మా వాడి దిల్లెపుడు మురిసేనురో.

Ekkada Untadhiro Aa Pilla Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download