కొత్త సోకు Kotha Soku Lyrics in Telugu
మంచాన ముసలాడే
మిల మిల మెరిసాడే
ముడతలు మరిసాడే
కనవే సిలకా
ఏళ్లున్న పొలగాడై
ఏతులు వడతాండే
ఎగ్గిరి పడతాండే
ఇనవే గిలకా
భారత్ల్య్రిక్స్.కోమ్
అంగి జూడే ఆతడి పొంగు జూడే
దోతి రంగు జూడే అదిరే
కడక్ కడక్ కొత్త సోకు
ఒంటికి అత్తరు గొట్టి అగ్గో అత్తండయ్యో
కళ్ళకు అద్దాలెట్టి సిగ్గే బడ్తాండయ్యో
పెళ్లికి పొల్లే ఉంటే జాడే సెప్పండయ్యో
మాపటి లగ్గం పెట్టి ఇంటికి పంపడయ్యో
కొత్తంగ సోకేదో అచ్చింది రయ్యో
మొత్తంగ ఊరంతా సోకిందిరయ్యో
తిప్పేసి మీసాలు పోతాండయ్యో
డప్పేసి ఏడూళ్లు సాటండయ్యో
సప్పుడు కూడింక ఎన్నాళ్లు అయ్యో
సక్కాని తోడింకా కావాలి రయ్యో
యాడున్నదో యాడున్నదో
ఉడుకుడుకు బువ్వెట్టేదేడున్నదో
సొమ్మున్నదో సోకున్నదో
ఒంటికి అత్తరు గొట్టి అగ్గో అత్తండయ్యో
కళ్ళకు అద్దాలెట్టి సిగ్గే బడ్తాండయ్యో
పెళ్లికి పొల్లే ఉంటే జాడే సెప్పండయ్యో
మాపటి లగ్గం పెట్టి ఇంటికి పంపడయ్యో
పిల్లా జెల్లా మేక పిల్లా ఏదీ యాదే లేకుండే
సోపతోల్ల సోయే లేక సొక్కంపూస అయ్యిండే
లగ్గం ఊసే ఎత్తామంటే లగ్గాయించి దూకిండే
యాల పాల ఇడిసి బెట్టి ఊళ్లే పట్టుకు పోతండే
సేలల్లో శెల్కల్లో జల్లెడ పట్టి సూత్తాండే
అత్తిల్లు యాడుందో అంటూ ఆగం అయితాండే
తొవ్వల్లో తాళ్లల్లో అవ్వ అక్కానడిగిండే
అచ్చిటోళ్ల పోయేటోల్ల ఆరాలెన్నో తీస్తాండే
తాతయ్య గోడేందో సూడండయ్యో
సూడండయ్యో సెప్పండయ్యో
ఆ పిల్లా జాడేదో పట్టండయ్యో
పట్టండయ్యో పాపం రయ్యో
ఒంటికి అత్తరు గొట్టి అగ్గో అత్తండయ్యో
కళ్ళకు అద్దాలెట్టి సిగ్గే బడ్తాండయ్యో
పెళ్లికి పొల్లే ఉంటే జాడే సెప్పండయ్యో
మాపటి లగ్గం పెట్టి ఇంటికి పంపడయ్యో.
